User Rating: / 7
PoorBest 

Ugadi pachadi,ugadi recipes,ugadi sweets,ugadi bobbatlu,ugadi vantalu,telugu ugadi sweets,ugadi special

కొబ్బరి అరిసెలు
కావలసిన పదార్థాలు: మైదాపిండి - కప్పు; పంచదార - రెండు కప్పులు; కొబ్బరి తురుము - కప్పు; యాలకుల పొడి - చెంచా; నెయ్యి - అరకప్పు; నూనె - తగినంత.
తయారీ: మైదాపిండిలో రెండు చెంచాల పంచదార వేసి పూరీ పిండిలా కలిపి అరగంట నాననివ్వాలి. యాలకులపొడి, మిగిలిన పంచదారను పొడిలా చేసుకుని కొబ్బరి తురుములో కలపాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి పూరీల్లా వత్తి పెట్టుకోవాలి. వీటిపై నెయ్యిరాసి రెండు చెంచాల కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి చుట్టూ మూసేయాలి. పైన కాస్త నెయ్యి రాసి లేదా పొడి పిండి చల్లి మరోసారి గుండ్రంగా వత్తాలి. అన్నింటినీ ఇలాగే చేయాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి సిద్ధంగా ఉన్న అరిసెల్ని వేయించాలి. బంగారువర్ణంలోకి వచ్చాక కాగితంపై పరిస్తే.. అదనపు నూనె సమస్య ఉండదు. తీయ తీయని కొబ్బరి అరిసెలు తయారవుతాయి.

User Rating: / 1
PoorBest 

Ugadi pachadi,ugadi recipes,ugadi sweets,ugadi bobbatlu,ugadi vantalu,telugu ugadi sweets,ugadi special

మామిడి బొబ్బట్లు

కావలసిన పదార్థాలు:

మామిడికాయ తురుము - అరకప్పు; క్యారెట్‌ తురుము - కప్పు; బీట్‌రూట్‌ తురుము - పావుకప్పు; పచ్చికోవా - కప్పు; మైదా - మూడు కప్పులు; నెయ్యి - కప్పు; పంచదార - రెండు కప్పులు; యాలకుల పొడి - టేబుల్‌ స్పూను; ఉప్పు - చిటికెడు; నూనె - తగినంత.
తయారీ:

మైదా పిండిలో ఉప్పు, మూడు చెంచాల పంచదార, పాలు చేర్చి చపాతీ పిండికన్నా కాస్త పల్చగా కలిపి గంటసేపు నానబెట్టాలి. బాణలిలో రెండుచెంచాల నెయ్యి వేడిచేసి బీట్‌రూట్‌, క్యారెట్‌ తురుములను పచ్చివాసన పోయే వరకు వేయించాలి. దాన్లో మామిడి తురుము కూడా చేర్చి మరికాసేపు వేగనివ్వాలి. పదినిమిషాలయ్యాక పంచదార, అరకప్పు నీరుచేర్చి ఉడికించాలి. బాగా ఉడికి దగ్గరపడ్డాక పచ్చికోవా, యాలకుల పొడి చేర్చి స్టౌ కట్టేయాలి. ఇప్పుడు మైదా పిండిని చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఒక ఉండను తీసుకుని పాలిథీన్‌ కవరుపై నూనె అద్దుతూ చేత్తో చిన్న పూరీలా వత్తాలి. ఇందులో మామిడికాయ మిశ్రమాన్ని రెండుచెంచాలుంచి.. చుట్టూ మూసి.. మళ్లీ వత్తాలి. పెనంపై రెండుచెంచాల నూనె వేడిచేసి ఒక్కో బొబ్బట్టునూ రెండువైపులా దోరగా కాలిస్తే సరి.

User Rating: / 2
PoorBest 

కొబ్బరి-బొప్పాయి లడ్డు


కావలసిన పదార్థాలు :
బొప్పాయి కాయ - అరకేజీ
కొబ్బరి కోరు - అర కేజీ
నెయ్యి - 100గ్రా
బెల్లం - పావు కిలో
పంచదారం - పావు కిలో
యాలకులు - తగినన్ని
జీడిపప్పు - తగినంత
కిస్‌మిస్ - తగినన్ని

తయారీ విధానం :
మొదట బొప్పాయి కాయ చెక్కు తీసి తురుముకోవాలి. తరువాత ఈ తురిమిన కోరుని ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తరువాత నీళ్లు తీసేసి తురుమును ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇంకో గిన్నెలో బెల్లం, పంచదార కొన్ని నీళ్లు వేసి సన్నని సెగపై పాకం పట్టాలి. పాకం వచ్చిన తరువాత ఉడికించిన బొప్పాయి తురుముతో పాటు కొబ్బరి తురుమును కూడా ఈ పాకంలో వేయాలి. పాకం కాస్త చిక్కగా అయిన తరువాత దానిలో నెయ్యి వేసి స్టవ్‌మీదనుంచి దించేయాలి. తరువాత దీనిని లడ్డూల్లా ఉండలు చుట్టుకొని జీడిపప్పు, కిస్‌మిస్ వేసి గార్నిష్ చేసుకోవాలి.

- జె. అర్పితాదేవి, తిలక్ వీధి, కాకినాడ

చిలగడ దుంప పూర్ణాలు


కావలసిన పదార్థాలు :
చిలగడ దుంపలు - కేజీ
బెల్లం - అరకేజీ
వేయించిన శనగపప్పు(పుట్నాల పప్పు) - పావు కిలో
యాలకులు - 10గ్రా
మినప పప్పు - పావు కిలో
బియ్యం - అరకేజీ
నూనె - అర కేజీ

తయారీ విధానం :
మొదట బియ్యం, మినప్పప్పును నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత దీనిని మిక్సీలో వేసి కాస్త ఉప్పు చేర్చి పూర్ణం పిండిలా పట్టుకోవాలి. తరువాత చిలగడ దుంపలను ముక్కలు కోసి ఉడకబెట్టుకోవాలి. చల్లారిన తరువాత ఈ ముక్కలకు బెల్లం, యాలకులు కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి. పుట్నాల పప్పును పొడిచేసి ఈ ముద్దలో కలపాలి. ఇప్పుడు ఈ ముద్దను ఉండ ల్లా చేసుకొని పూర్ణం పిండిలో ముంచి నూనెలో దోరగా వేయించి తీసుకోవాలి. దీంతో చిలగడ దుంప పూర్ణాలు రెడీ అయినట్టే.
- వి. స్వరాజ్యలక్ష్మి, చనుగొండ, కృష్ణా

తెలుగింటి చాట్


కావలసిన పదార్థాలు :
మైదా పిండి, నూనె, పాలు, నెయ్యి, వేరుసెనగ గుళ్లు, ఎండు కొబ్బరి, బెల్లం, పుట్నాల పప్పు(వేయించిన సెనగపప్పు), డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు మనకు కావలసిన మోతాదును బట్టి క్వాంటిటీని ఎన్నుకోవాలి.

తయారీ విధానం :
ముందుగా మైదాను పాలతో తడిపి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి, బెల్లంను తురుముకోవాలి. నువ్వులు, వేరుసెనగను వేయించి కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను నేతిలో వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. దీంతోపాటు పుట్నాల పప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదాను బాగా పిసికి చిన్నచిన్న ముద్దలుగా చేసుకొని పూరీల్లా వత్తుకోవాలి. ఒకే పరిమాణంలో ఉన్న చిన్న గిన్నెలు తీసుకుని గిన్నెల వెనుక వైపునకు ఈ పూరీలను అంటించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ బాణలిలో నూనె పోసి వేడిక్కిన తరువాత ఈ గిన్నెలను అందులో వేయాలి. గిన్నెల నుంచి పూరీలు విడిపోయిన తర్వాత వీటిని నూనెలో నుంచి తీసెయ్యాలి. ఇప్పుడు పిండి కప్పులు రెడీ అయ్యాయన్న మాట! ఈ పిండి కప్పుల్లో మొదట కొద్దిగా నెయ్యి రాసి దానిపైన కొబ్బరి తురుము, వేరుసెనగ కాయల పొడి, దానిపైన బెల్లం తురుము తరువాత నువ్వుల పొడి, పుట్నాల పప్పు పొడి వేసి పైన డ్రై ఫ్రూట్స్ వేసి అలంకరించుకుంటే కమ్మని తెలుగింటి చాట్ రెడీ అయినట్లే. ఇది భలే టేస్టీగా ఉంటుంది.
- మావిళ్ల పద్మారాణి, దోమలగూడ, హైదరాబాద్

ఆలూ ఫ్రూట్ బాల్స్


కావలసిన పదార్థాలు :
ఉడికించిన బంగాళ దుంపలు - 4,
ఖర్జూర పండు ముక్కలు - 20,
జీడిపప్పు - 20 పలుకులు,
కిస్‌మిస్ - 20, సారపప్పు - చెంచా,
పంచదార పొడి - మూడు చెంచాలు,
యాలకుల పొడి - రెండు చెంచాలు,
నెయ్యి - తగినంత.

తయారీ విధానం :
ముందుగా బంగాళ దుంపలను మొత్తగా ఉడికించి పూర్తిగా శుభ్రం చేసి మొత్తగా చిదమాలి. తరువాత ఆ మిశ్రమాన్ని నేతిలో వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. జీడిపప్పు, బాదంపప్పు, సారపప్పు ముక్కలను కూడా నేతిలో వేయించి వాటిని బంగాళదుంపల మిశ్రమంలో వేసి కలపాలి. అందులో పంచదార పొడి, యాలకుల పొడి కూడా వేసి చిన్నచిన్న ఉండలుగా చుట్టి వాటిని కొబ్బరి పొడిలో అద్దుకోవాలి. కావాలనుకుంటే వాటిపైన ఒక చెర్రీ పెట్టుకుని అలంకరిచుకోవచ్చు. దీంతో 'ఆలూ ఫ్రూట్ బాల్స్' సిద్ధమయినట్లే.
- పి. శ్రీదేవి, మారుతి నగర్, సంతోష్‌నగర్, హైదరాబాద్

మలై కాజా


కావలసిన పదార్థాలు :
పాల మీగడ - 100 గ్రా
పనీర్ తురుము - అరకేజీ
జామూన్ మిక్స్ - 200గ్రా
పంచదార - కేజీ
నీళ్లు - తగినన్ని
నూనె - వేయించడానికి సరిపడా
మైదా - 100గ్రా
యాలకుల పొడి - అరచెంచా

తయారీ విధానం :
పనీర్ తురుములో మైదా, పాలమీగడ, జామూన్ మిక్స్, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలపాలి. ఈ పిండిని అరగంట పాటు నానబెట్టుకోవాలి. పంచదారలో తగినన్ని నీళ్లు పోసి లేతపాకం పట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత పిండిని చిన్నచిన్న ముద్దలుగా చేసి గుండ్రని బిళ్లల్లా వత్తి నూనెలో దొరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పంచదార పాకంలో వేసి మూడు నిమిషాల పాటు నాననివ్వాలి. తర్వాత వీటిని తీసేసి కాస్త పంచదారలో రెండువైపులా దొర్లించి తీసి ట్రేలో విడివిడిగా సర్దుకోవాలి. వీటి రుచి అమోఘంగా ఉంటుంది. అంతేకాక ఈ మలైకాజాను వారం రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు కూడా.
- యు. శిరీషా, తణుకు

కద్దూ కీ ఖీర్


(సొరకాయ పాయసం)
కావలసిన పదార్థాలు :
సొరకాయ - చిన్నది 1
పాలు - లీటర్
బాస్మతి రైస్ - 100గ్రా
కార్న్ ఫ్లోర్ - 100గ్రా
కోవా లేదా ఖలాకండ్ - పావు కిలో
పంచదార - అరకేజీ
మిల్క్ మెయిడ్ - 400గ్రా
నెయ్యి - 50గ్రా
జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష - 50గ్రా
ఫుడ్ కలర్ (గ్రీన్) - చిటికెడు

తయారీ విధానం :
ముందుగా బాస్మతి బియ్యాన్ని చిటికెడు నెయ్యిలో వేయించి పిండి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో పాలు పోసి అవి మరుగుతున్నప్పుడు బియ్యం పిండిని నీళ్లలో కలిపి పేస్టులా చేసి గరిటెతో కలుపుతూ ఆ పాలల్లో పోయాలి. అలాగే మొక్కజొన్న పిండిని కూడా పేస్టులా చేసి అందులో పోయాలి. దాంతోపాటు సొరకాయ తురుమును కాస్త ఉడికించి పాలల్లో వేయాలి. తర్వాత చక్కెర వేసి కాస్త చల్లారిన తర్వాత కోవా, మిల్క్ మెయిడ్, గ్రీన్ కలర్‌లను వేసి బాగా కలపాలి. చివరగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్షలను నెయ్యిలో దోరగా వేయించి నెయ్యితో పాటు పాయసంలో పోసి ఒక అరగంట డీప్ ఫ్రిజ్‌లో పెట్టి సర్వ్ చేస్తే చాలా మధురంగా ఉంటుంది. ఈ పాయసం ఫ్రిజ్‌లో వారం, పది రోజుల పాటు నిల్వ ఉంటుంది.
- రూహీ, ఎస్.సి. కమ్యూనిటీ హాల్ దగ్గర, లింగాల రోడ్డు, అచ్చంపేట, మహబూబ్‌నగర్

క్యారెట్ ఖీర్


కావలసిన పదార్థాలు :
క్యారెట్ - పావు కిలో
చిక్కటి పాలు - లీటరు
పంచదార - పావు కిలో
జీడిపప్పు - వంద గ్రా.,
యాలకులు - 4 (పొడిచేసుకోవాలి)

తయారీ విధానం :
క్యారెట్‌ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. తరువాత ఈ ఉడికిన ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. పాలు కాచి, పొంగువచ్చే సమయంలో ఈ ముద్ద, యాలకుల పొడి వేయాలి. సన్నని సెగపై అడుగు అంటకుండా కలయతిప్పుతూ ఉండాలి. ఇలా పదినిమిషాల పాటు తిప్పి పంచదార వేయాలి. దీంతో క్యారెట్ ఖీర్ తయారయినట్టే.

ఈ ఖీర్‌ను వేడి వేడిగా తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది. చల్లారాక కూడా దీని రుచిలో మార్పేమి ఉండదు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. బాదం పాలులా కనిపించే దీనిని పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు.
- టి. కవిత, వినాయక నగర్, పెదగంట్యాడ, విశాఖపట్టణం.

పాల పూరీలు


కావలసిన పదార్థాలు :
పాలు - అర లీటరు
పంచదార - 200గ్రా
కొబ్బరి పాలు - అర లీటరు (కొబ్బరి కోరుని మిక్సీలో వేసి చిక్కగా పాలు తీసుకోవాలి)
యాలకుల పొడి - కొద్దిగా
మైదా - 200గ్రా
గోధుమపిండి - 200గ్రా
ఉప్పు - అరచెంచా
గసగసాలు - 25గ్రా
పూరీలు వేయించడానికి
సరిపడా నూనె

తయారీ విధానం :
ముందుగా మైదా, గోధుమపిండి, ఉప్పు, నీళ్లు వేసి పూరీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి. కాచిన పాలలో పంచదార, కొబ్బరిపాలు, యాలకుల పొడి, గసగసాల పొడి(నూనె వేయకుండా వేయించి పొడిచేసి ఉంచుకోవాలి) వేసి పంచదార బాగా కరిగేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండితో పూరీలు చేసి ఎర్రగా వేయించి ఈ పాలలో వేయాలి. ఇవి బాగా నానితే మంచి రుచితో నోరూరిస్తాయి. ఈ పాల పూరీలు మంచి బలమైన ఆహారం కూడా.
- కె. త్రిపురా సింగ్, పి.ఎఫ్ క్వార్టర్స్, మర్రిపాలెం, విశాఖపట్నం

బుట్టా కా హల్వా


కావలసిన పదార్థాలు :
లేత మొక్కజొన్న గింజలు - మూడు కప్పులు
పంచదార - అరకిలో
నెయ్యి - వంద గ్రాములు
యాలకులు - 5
జీడిపప్పు - 10 పలుకులు
ఎండు ద్రాక్ష - చెంచా

తయారీ విధానం :
ముందుగా మొక్కజొన్న గింజలను మెత్తగా రుబ్బి అందులోంచి పాలను పిండి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఓ పాత్రలో కొంచెం నేయి వేసి అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఓ నాన్‌స్టిక్ పాన్‌లో గ్లాసు నీళ్లు, పంచదార వేసి మరిగించాలి. కాస్త పాకం వచ్చిన తరువాత మొక్కజొన్న పాలను అందులో వేసి చిక్కబడే వరకు గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల అది చిక్కబడి ముద్దలా తయారవుతుంది. అప్పుడు అందులో నెయ్యి వేసి హల్వాలా అయ్యేవరకు కలిపాలి. చివరగా యాలకుల పొడి, నేతిలో వేయించి తీసిన ఎండుద్రాక్ష, జీడిపప్పు ఆ ముద్దలో వేసి కలపాలి. ఇప్పుడు ఈ హల్వాను చిన్న పళ్లెంలో వేసి చల్లారిన తరువాత ముక్కలుగా కోస్తే సరి, నోరూరించే బుట్టా కా హల్వా తయారవుతుంది.
- బి. భావన, సికింద్రాబాద్

అరటిపండు డ్రై బర్ఫి


కావలసిన పదార్ధాలు :
మైదాపిండి - కప్పు
అరటిపండు గుజ్జు - కప్పు
డాల్డా లేదా నెయ్యి - ఒకటిన్నర కప్పు
వెన్న - రెండు చెంచా
పంచదార - పావు కిలో
కిస్‌మిస్‌లు - 20
యాలకులు - 5
బాదం పప్పు - 20గ్రా
జీడిపప్పు - 20గ్రా

తయారీ విధానం :
ముందుగా మైదాను శుభ్రంగా జల్లించుకోవాలి. అరటిపండును తొక్కతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఇప్పుడు ఓ పాత్రలో మైదా, అరటిపండు గుజ్జు వేసి అందులో వెన్న వేసి ముద్దలా కలపాలి. తరువాత ఓ బాణలిలో కిద్దిగా నెయ్యి వేసి అందులో జీడిపప్పును వేయించి తీసేయాలి. ఇప్పుడా బాణలిలో మరో రెండు చెంచాల నెయ్యిని వేసి ముద్దగా చేసిపెట్టుకున్న మైదా మిశ్రమాన్ని అందులో వేసి దోరగా వేయించాలి. ఇలా చేయడం వల్ల ముద్ద పచ్చివాసన పోతుంది. ఇప్పుడీ ముద్దలో కిస్‌మిస్, జీడిపప్పు, యాలకులు పొడి వేసి మెత్తగా పూరీల పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడా పిడిని చిన్న చిన్న బిళ్లల్లా చేతితో పట్టుకుని వత్తుకోవాలి. ఇలా బిళ్లల్లా వత్తుకున్న తరువాత బాణలిలో నెయ్యి వేసి కరిగిన తరువాత ఈ బిళ్లలను వేసి ఎర్రగా వేయించి తీసేయాలి. వేయించిన తీసిన బిళ్లలను ఓ ప్లేటులో కింద పేపర్ పెట్టి వీటిని సర్ది పైన పంచదార చల్లుకుంటే అరటిపండు డ్రై బర్ఫీ సిద్ధమయినట్లే!
- పంపిన వారు పేరు రాయలేదు

కాజు-బొప్పాయి ముర్జీ


కావలసిన పదార్థాలు :
బాగా పండిన బొప్పాయి పండు - చిన్నది
పంచదార - రెండు కప్పులు
నెయ్యి - కప్పు
యాలకులు పొడి- అర చెంచా
జీడిపప్పు తురుము (పొడవుగా సన్నగా తురిమినది) - మూడు చెంచాలు బాదం తరుము - రెండు చెంచాలు
ఆరెంజ్ లేదా రెడ్ కలర్ - పావు చెంచా (ఇష్టమైతేనే)
మైదా - అర కప్పు
చిక్కటి పాలు - కప్పు
బాదం పప్పు ముక్కలు - చెంచా
కిస్‌మిస్ - 12
పచ్చి కొబ్బరి - పావు కప్పు.

తయారీ విధానం :
ముందుగా బొప్పాయి పండు చెక్కు తీయాలి. తరువాత దానిని శుభ్రం చేసి సగానికి కోసి లోపల గింజలను పూర్తిగా తొలగించి చిన్నచిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కల్ని మిక్సీలో వేసి పేస్టులా చేసి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో స్పూను నెయ్యి వేసి మైదాను మంచి వాసన వచ్చేవరకు వేయించి ఓ గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్‌స్టిక్ పాన్ తీసుకుని దాంట్లో పంచదార ఒక కప్పు, నీళ్లు పోసి చిక్కటి పాకం వచ్చేవరకు ఉడికించి, కప్పు పాలు పోయాలి. పాలు రెండు నిమిషాల్లో విరిగిపోతాయి. అందులో కలర్, మైదా, బొప్పాయి పేస్టు, పచ్చికొబ్బరి, జీడిపప్పు, బాదం తురుము, ముక్కలు వేసి అందులో నెయ్యి పోసి కలపాలి. తరువాత ఓ పళ్లానికి నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోసి పైన కిస్‌మిస్‌లు అందంగా అలంకరిస్తే సరి 'కాజు-బొప్పాయి ముర్జీ' రెడీ అయినట్టే. ఇంకా కావాలనుకుంటే కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.
- కె. శ్రీమాధవి, పొన్నూరు, గుంటూరు జిల్లా

నూగుపొడి పూర్ణాలు


కావలసిన పదార్థాలు :
తెల్ల నువ్వుల - పావు కిలో
బెల్లం - పావు కిలో
బియ్యం పిండి - పావు కిలో
యాలకులు - 5
ఎండు కొబ్బరి - 100గ్రా
నూనె - తగినంత

తయారీ విధానం :
ఓ బాణలిలో నూనె వేసి అందులో తెల్ల నువ్వులను వేసి దోరగా వేయించాలి. నువ్వులు చల్లారిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. తరువాత బెల్లం, యాలకులను కూడా పొడి చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరిని తురుములా చేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో తగినంత నీరు పోసి కొంచెం ఉప్పు వేసి జారుడుగా కలుపుకోవాలి. అనంతరం పొడిగా చేసిపెట్టుకున్న నువ్వుల పొడి, బెల్లం, యాలకుల పొడి, కొబ్బరి తురుమును బాగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలిలో నూనె పోసి కాగిన తరువాత ఈ నువ్వుల ఉండలని జారుడుగా కలిపి ఉంచిన పిండిలో ముంచి నూనెలో వెయ్యాలి. దోరగా వేయించి తీస్తే సరి నూగుపొడి పూర్ణాలు సిద్ధమయినట్టే. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. పిల్లలు వీటిని చాలా ఇష్టంగా తింటారు.
- సాగి రాజేశ్వరి, పాతూరు, నరసరావుపేట,గుంటూరు జిల్లా

* పకోడీలు కరకరా రావడానికి శెనగపిండి మిశ్రమానికి కాస్త కార్న్‌ఫ్లోర్‌ను కలపాలి.
* అల్యూమినియం పాత్రలు మాడిపోయినప్పుడు దానిలో ఒక ఉల్లిపాయను నీళ్లలో వేసి మరిగించాలి. లోపల అంటుకున్నదంతా తెట్టులా పైకి దానంతట అదే తేలిపోతుంది.
* చల్లటి నీటికి నిమ్మరసాన్ని కలిపి వడిలిపోయిన కూరగాయలను అందులో కాసేపు నాననిస్తే తాజాదనాన్ని సంతరించుకుంటాయి.
* వడిలిపోయిన టమాటాలను ఉప్పు కలిపిన చల్లటి నీటిలో వేసి రాత్రంతా వదిలేస్తే ఉదయానికల్లా తాజాగా అవుతాయి.
* ఆకుపచ్చ బఠానీల రంగు మారకుండా చాలాకాలం నిలవ ఉండాలంటే మరిగే నీటిలో వేసి ఉడికించాలి. నీటిని వంచేసి చల్లటి నీటిలో తడిపి ఆరబెట్టాలి.
* కంటనీరు పెట్టకుండా ఉల్లిపాయలను కొయ్యాలంటే ముందు రెండు ముక్కలుగా కోసి నీళ్లలో వెయ్యాలి. కాసేపు ఫ్రిజ్‌లో పెట్టినా మంచిదే.

User Rating: / 3
PoorBest 

క్యాప్సికం చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాప్సికం- అర కిలో, ఎండుమిరపకాయలు- 8, సెనగపప్పు- 8 చెంచాలు, మినపపప్పు- 6 చెంచాలు, ఆవాలు-4 చెంచాలు, మెంతులు- ఒకటిన్నర చెంచా, కరివేపాకు- ఒక రెబ్బ, నూనె- 8 చెంచాలు, పసుపు- అర చెంచా, చింతపండు- కుంకుడుకాయంత, ఉప్పు- తగినంత, ఇంగువ- అర చెంచా. పోపుని రెండు భాగాలు చేసుకోవాలి. ఒక భాగాన్ని పొడి చేసి పెట్టుకోవాలి. ఇంకో భాగాన్ని అలంకరణకి ఉపయోగించాలి.

తయారీ విధానం : ఒక బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక ఒక చెంచా ఆవాలు, 4 చెంచాల సెనగపప్పు, 3 చెంచాల మినపపప్పు, 2 ఎండు మిరపకాయలు వేసి ఎర్రగా వేయించాలి. చివర్లో కరివేపాకు, ఇంగువ వేసి వేరే పాత్రలోకి మార్చుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా మిగిలిన ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, మెంతులు, ఎండు మిర్చి వేసి ఎర్రగా వేయించాలి. చల్లారిన తర్వాత పొడి చేస ఉంచుకోవాలి. బాణలిలో 4 చెంచాల నూనె పోసి కాగాక క్యాప్సికం ముక్కలు వేసి బాగా వేయించి చల్లార్చాలి. తాలింపు పొడి ఇంకో భాగం, క్యాప్సికం ముక్కలు, నానబెట్టిన చింతపండు మిక్సీలో వేసి చట్నీ చేయాలి. దీనికి మొదట తయారు చేసిన తాలింపు కలిపితే రుచికరమైన క్యాప్సికం చట్నీ రెడీ. చివరిలో తగిన ంత ఉప్పు కలుపుకోవాలి.

- సి. శారదా కామేశ్వరి, ఖైరతాబాద్, హైదరాబాద్

క్యాబేజీ చట్నీ


కావలసిన పదార్థాలు : క్యాబేజీ- సగభాగం, వేరుసెనగ పప్పు- పావు కప్పు, ఎండు మిరపకాయలు- 3, మినపపప్పు- 1 చెంచా, సెనగపప్పు- 1 చెంచా, ఇంగువ- అర చెంచా, ఉప్పు- తగినంత, నూనె- కొంచెం, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- కొంచెం.

తయారీ విధానం : రెండు లేదా మూడు చెంచాల నూనెని వేడిచేసి వేరుశెనగపప్పు, ఎండు మిర్చి వేయాలి. తర్వాత క్యాబేజీ తురుము వేసి పొడిగా అయ్యే వరకూ వేయించాలి. వీటిని చల్లార్చి కొద్దగా నీరుపోసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు బాణలిలో మరో రెండు చెంచాల నూనె వేసి అందులో ఆవాలు, సెనగపప్పు, మినపపప్పు, కరివేపాకు వేసి వేయించాలి. అది వేగాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమానికి జోడించాలి. చివరగా ఉప్పు, ఇంగువ వేసి ఐదు నిమిషాల తర్వాత దించుకోవాలి. ఇది అన్నం, ఇడ్లీ,దోసెల్లోకి చాలా బాగుంటుంది. క్యాబేజీ వాసన గిట్టని వారు కూడా దీన్ని ఇష్టంగా తింటారు.

- ఇ.భువనేశ్వరి, ప్రకాశం రోడ్, తిరుపతి

వంకాయ పెరుగుపచ్చడి


కావలసిన పదార్థాలు : పెద్దవంకాయలు-2, పచ్చి మిరపకాయలు-2, ఎండు మిరపకాయలు-2, కొబ్బరి తురుము-2 చెంచాలు, ఆవాలు- అర చెంచా, ఇంగువ- అర చెంచా, నూనె-2 చెంచాలు, పెరుగు- 2 కప్పులు, ఉప్పు తగినంత తయారీ విధానం : వంకాయలకు నూనెరాసి సన్నని మంటపై కాల్చుకోవాలి. చల్లారాక తొక్కతీసి ముద్దగా చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొబ్బరి తురుము కలిపి రుబబుకోవాలి. దీన్ని వంకాయ గుజ్జు, ఉప్పు, పెరుగుతో కలుపుకోవాలి. ఆవాలు, ఇంగువ మిరప కాయలతో పోపు చేసి ఈ ముద్దకి చేర్చాలి. అంతే రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి రెడీ.

- జి.భాగ్యలక్ష్మి, కొల్లాపూర్, మహబూబ్‌నగర్

పాలకూర చట్నీ


కావలసిన పదార్థాలు : పాలకూర- 2 కట్టలు, కొత్తిమీర- 1కట్ట, పచ్చి మిరపకాయలు- 8, జీలకర్ర- చెంచా, మెంతులు- ఒక చెంచా, పసుపు- చిటికెడు, నూనె- 6చెంచాలు, బెల్లం- 1చెంచా, నువ్వులు- 1 చెంచా, ఉప్పు- తగినంత.

తయారీ విధానం : ముందుగా పాలకూర కొత్తిమీరను కడిగి సన్నగా తురుముకోవాలి. జీలకర్ర మెంతులను వేడిచేసి గ్రైండర్‌లో పొడి చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనెపోసి మిరపకాయలను దోరగా వేయించుకోవాలి. తర్వాత పాలకూర కొత్తిమీరను వేసి వేయించాలి. అందులో పసుపు తగినంత ఉప్పు వేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని గ్రైండర్‌లో వేయాలి. దాంతోపాటు జీలకర్ర మెంిపొడి, నువ్వులు, చింతపండు, బెల్లాన్ని కూడా గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. దీంతో పాలకూర చట్నీ సిద్ధమైనట్లే. దీనిని అన్నం, చపాతీ, పూరీలతో కలిపి తింటే రుచికరంగా ఉంటుంది.

- వి.వాసంతి మధుసూదన్, వనపర్తి, మహబూబ్‌నగర్

టమోటా ఆవకాయ


కావలసిన పదార్థాలు : టమోటాలు- 1 కిలో, నూనె- పావు కిలో, చింతపండు- 150 గ్రా, కారం- 125 గ్రా, ఉప్పు- పావు కిలో, అల్లంవెల్లుల్లి పేస్ట్- పావుకిలో, జీలకర్ర పొడి- 50 గ్రా, మెంతిపొడి-25 గ్రా, జీలకర్ర- 2 టీ చెంచాలు, ఆవాలు- 1 టీ చెంచా, ఇంగువ-చిటికెడు

తయారీ విధానం : చింపండు గుజ్జులో టమోటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. ఇంగువ, జీలకర్ర, ఆవాలు నూనెలో వేయించి తీయాలి. చల్లారిన తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్‌బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టమోటా ముద్దలో వేసి బాగా కలిపి మూత పెట్టాలి. దీంతో టమోటా ఆవకాయ తయారయినట్లే. ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది

- మల్లోజు జనార్దన్ రావు, జున్నూరు, పశ్చిమగోదావరి జిల్లా

బీట్‌రూట్ చట్నీ


కావలసిన పదార్థాలు : బీట్‌రూట్- అర కిలో, చింతపండు- కొద్దిగా, పసుపు- చిటికెడు, ఎండు మిరపకాయలు- 10, ఆవాలు- చెంచా, మెంతులు - కొద్దిగా, ఇంగువ-కొద్దిగా, మినపపప్పు- చెంచా, ఉప్పు- తగినంత, కరివేపాకు- ఒక రెమ్మ, నూనె-50 గ్రాములు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో రెండు టీ స్పూన్ల నూనె వేసి వెచ్చబడ్డాక ఆవాలు, మెంతులు, ఎండు మిరపకాయలు, ఇంగువతో తాలింపు వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తురిమి పెట్టుకున్న బీట్‌రూట్‌ని పచ్చివాసన పోయేదాక నూనెలో వేయించాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, నానబెట్టిన చింతపండు గుజ్జు, ఇంతకుముందు వేయించి ఉంచిన తాలింపు మొత్తం వేసి రుబ్బాలి. ఈ పచ్చడిని ఒక కప్పులోకి తీసుకుని దానికి కొద్దిగా మినపపప్పు, ఆవాలు, కరివేపాకు, తాలింపువేసి కలుపుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలోకి, చపాతీ, పూరీల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది.

- మైలవరపు శ్రీవల్లి, మూసాపేట, హైదరాబాద్

పైనాపిల్ పచ్చడి


కావలసిన పదార్థాలు : పండిన పైనాపిల్-1, బెల్లం- అరకిలో, కరివేపాకు-ఒక రెబ్బ, ఎండు మిరపకాయలు-5, కొబ్బరికాయ-1, ఆవాలు- అర చెంచా, పసుపు- అర చెంచా, జీలకర్ర-1 చెంచా, ఉప్పు- తగినంత

తయారీ విధానం : పైనాపిల్ చెక్కుతీసి చక్రాలుగా తురుముకోవాలి. ఓ పాత్రలో కొంచెం నీరుపోసి అందులో ముక్కలను వేసి సన్నని మంట మీద ఉడికించండి. అందులో పసుపు, కారం ఉప్పు వేయండి. బెల్లం సన్నగా తురమండి. కొబ్బరి కోరులో జీలకర్ర, ఆవాలు కలిపి మెత్తని ముద్దగా నూరండి. ఎండు మిరపకాయలను విడిగా నూరి ముద్ద చేసుకోండి. ఉడుకుతున్న పైనాపిల్ ముక్కలు మొత్తబడగానే బెల్లం వే సి గంటెతో కలుపుతూ ఉండండి. ద్రావణం చిక్కబడుతుండగా కొబ్బరి ముక్క ఎండు మిర్చి ముద్ద, కరివేపాకు వేసి బాగా కలిపి దించండి. సిద్ధమైన పైనాపిల్ పచ్చడిని బ్రెడ్‌టోస్టుతో కలిపి వడ్డించండి.

- జి.కవిత, ఖానాపూర్, మహబూబ్‌నగర్

చింతపండు చట్నీ


కావలసిన పదార్థాలు : చింతపండు- నాలుగు రెబ్బలు, ఎండుమిరప కాయలు- మూడు, మినపపప్పు- మూడు చెంచాలు, నువ్వులు- మూడు చెంచాలు, ధనియాలు-2 చెంచాలు, ఎండు కొబ్బరి పొడి- 2 చెంచాలు, నూనె- చెంచా, బెల్లం లేదా పంచదార- 2 చెంచాలు, ఉప్పు తగినంత.

తయారీ విధానం : ముందుగా చింతపండును నానబెట్టాలి. తర్వాత మినపపప్పు, నువ్వులు, ధనియాలు విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక బాణలిలో నూనెపోసి ఎండు మిర పకాయలను వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఆ పొడిలో చింతపండు రసం, చింతపండు రెబ్బలు, మినపపొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, తగినంత ఉప్పు, బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇష్టమున్నవాళ్లు తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని వేడి వేడి అన్నంలో లేదా పూరీ, చపాతీల మీదగాని వేసుకుని తినవచ్చు.

- పి. వారిజ, జక్కాపూర్, మెదక్

మునగాకు చట్నీ


కావలసిన పదార్థాలు : మునగాకు- 2కప్పులు, ఎండు మిరపకాయలు - 10, సెనగపప్పు- 2 చెంచాలు, మినపపప్పు- 2 చెంచాలు. కొబ్బరి తురుము- 1 కప్పు, చింతపండు- కాస్తంత, వేయించడానికి సరిపడినంత నూనె, ఉప్పు- తగినంత, ఆవాలు- అర చెంచా, కరివేపాకు- 2 రెబ్బలు.

తయారీ విధానం : ముందుగా బాణలిలో కొద్దిగా నూనె పోసి వేడెక్కిన వెంటనే ఎండు మిరపకాయలు, సెనగపప్పు, మినప పప్పు వేసి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో మరి కొంత నూనెపోసి మునగాకు వేయించాలి. తర్వాత వేయించిన మునగాకు ఎండుమిర్చి, సెనగపప్పు, మినపపప్పు, కొంచెం చింతపండు, ఉప్పు, కొబ్బరి తురుము వేసి అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేయాలి. చివరిగా బాణలిలో మరో చెంచా నూనెవేసి ఆవాలు కొద్దిగా, మినపపప్పు, కరివేపాకు వేసి పోపు పెడితే సరిపోతుంది. దీంతో రుచికరమైన మునగాకు చట్నీ సిద్ధమైనట్లే.

- పి.రమాదేవి, సిర్సపల్లి, కరీంనగర్

మెంతి చట్నీ


కావలసిన పదార్థాలు : మెంతికూర కట్టలు-3, నూనె- 3 చెంచాలు, ఎండు మిరపకాయలు- 5, ఇంగువ- కొద్దిగా, బెల్లం- నిమ్మకాయంత, చింతపండు- పెద్ద నిమ్మకాయంత, పసుపు-కొద్దిగా.

తయారీ విధానం : మెంతి ఆకుని గిల్లుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. బాణలిలో మూడు చెంచాల నూనె పోసి అందులో మెంతి ఆకుని వేసి కొంచెం నల్లరంగులోకి వచ్చేదాకా వేయించాలి. తర్వాత చింతపండుని వేడినీటిలో వేసినట్లయితే వెంటనే మెత్తపడుతుంది. ఈ లోపు రెండు చెంచాల నూనెని బాణలిలో వేసి అందులో 5 ఎండు మిరపకాయలు, ఇంగువ వేసి దింపేయాలి. ముందుగా వేయించిన మెంతి ఆకుని గ్రైండర్‌లో వేసి రెండు మూడుసార్లు తిప్పాలి. తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఎండుమిర్చి వేసి ఒక నిమిషం తిప్పాలి. అది మెత్తపడ్డాక మెత్తగా చేసుకున్న బెల్లం, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి మరలా తిప్పాలి. దీంతో ఘమఘుమలాడే మెంతి చట్నీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోశె, చ పాతీల్లోకీ బాగుంటుంది.

- మద్దాలి అచ్యుత లక్ష్మీకుమారి, సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లా

* కాస్త ఉప్పు కలిపిన నిమ్మరసంతో తోమితే రాగిపాత్రలకు మెరుపు వస్తుంది. పాత్రలకంటిన నూనె జిడ్డు వదిలించాలన్నా ఇదే మార్గం.
* మైక్రోవేవ్‌లో వండినప్పుడు ఒలికిన పదార్థాలను తొలగించాక కాస్త ఉప్పు జల్లి తడి బట్టతో శుభ్రం చేస్తే మాడువాసన లేకుండా ఒవెన్ శుభ్రపడుతుంది.
* కొంచెం వెనిగర్, ఉప్పు కలిపి జల్లి మెత్తటి పీచుతో తోమితే స్టీలుపాత్రలు మెరుపు సంతరించుకుంటాయి.
* ఎప్పుడూ కాఫీ పెట్టే గిన్నె/పాట్‌కు గోధుమ రంగు మరకలవడం సహజం. అవి పోవాలంటే దానిలో ఒకసారి టీ పొడిని మరిగించి తర్వాత శుభ్రం చెయ్యాలి. తేయాకులో ఉండే టానిక్ యాసిడ్ కాఫీ మరకలను తీసేస్తుంది.
* సబ్బు నీటిలో చిటికెడు అమ్మోనియా పొడి కలిపి తోమితే పాత్రల దుర్వాసన పోతుంది.

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details