Cooking Tips

ఎక్కువ రోజుల నుంచి వాడుతున్న వంటసోడా సరిగా ఉందో తెల్సుకోవాలంటే ఇలాచేసి చూడండి. ఒక పాత్రలో నీటిని బాగా మరిగించి అందులో కొంచెం వంటసోడా వేయండి. నీటిలో వెంటనే బుడగలు వస్తే అది చక్కగా పనికొస్తుందని అర్థం.

ఇల్లే వైకుంఠం అనుకుంటూ కొందరు పొద్దస్తమానం వంటింట్లోనే కాలక్షేపం చేస్తుంటారు. కొద్దిగా పెద్ద కుటుంబం అయితే సరేసరి...ఉదయం లేచిన దగ్గరనుంచి టిఫిన్స్‌ ఏం చేయాలా? భోజనంలో కూరలు ఏం చేయాలో అని ఆలోచిస్తుంటారు. అటువంటివారి కోసం కొన్ని వంటింటి చిట్కాలు రెడీగా ఉన్నాయి. వీటిని పాటిస్తే వంటింట్లో ఎడతెగకుండా సమస్యలుగా ఉండేవాటికి కొంత పరిష్కారం లభించినట్లే... అవేమిటో ఇప్పుడు చూద్దాం రండి...


  • నూనె తక్కువ వాడడం ఆరోగ్యానికి చాలా మంచిది. నూనె తక్కువ వేసినా కూర రుచిగా ఉండాలంటే ఈ విధంగా చేసి చూడండి. బాణాలి లేదా గిన్నె బాగా వేడెక్కిన తరువాత నూనె వేసినట్టయితే తక్కువ నూనెతో కూడా వేపుడు కూరలు చేసుకోవచ్చు.

  • గారెల పిండిలో కొద్దిగా సేమ్యా వేయించి కలిపితే మంచి రుచిగా ఉంటాయి. తినేటప్పుడు గారెలు కరకరలాడుతూ అచ్చంగా హోటల్‌లో తిన్నట్లే ఉంటాయి.

హోమ్‌ టిప్స్‌

- పంచదారకు చీమలు పట్టకుండా ఉండాలంటే ఆ డబ్బాలో రెండు
లవంగాలు ఉంచండి.

- పెరుగు త్వరగా పులవకుండా ఉండాలంటే అందులో కొబ్బరిముక్కను వేయాలి.

-బంగారం చిలుము వదలాలంటే బ్రష్‌మీద పేస్ట్‌ వేసి బంగారు ఆభరణాలపై రుద్దాలి.

-పచ్చిమిరపకాయలు ఎక్కువగా కొన్నప్పుడు వాటి తొడిమలు తీసి ఫ్రిజ్‌లో ఒక కవర్‌లో ఉంచితే ఎక్కువరోజులు నిలవ ఉంటాయి.

- కొత్తిమీర, కరేపాకు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలాగాక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మొత్తగా పేస్ట్‌మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పును జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే...మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు. ఎక్కువకాలం నిలవవుంటాయి.

- అల్లం, పచ్చిమిరపకాయలను కూడా అలాగే మొత్తగా రుబ్బుకుని వాటిని ఉండలుగా చేసి, ఉప్పుకలిపి నిలవవుంచుకోవచ్చు.

- పప్పు త్వరగా ఉడకాలంటే ఉడికేటప్పుడు అందులో కొద్దిగా నూనెగానీ, డాల్డాగానీ వేసుకుంటే రుచికూడా బాగుంటుంది. త్వరగా ఉడికిపోతుంది.

- నిమ్మకాయలు పిండేశాక ఆ తొక్కలను వెంటనే పారేయకుండా కుక్కర్‌ అడుగున నిలవవుండే నీళ్లల్లో వేసేసుకోవాలి. ఉడికేటప్పుడు చెడు వాసన రాకుండా ఉంటుంది.

- వాడిపారేసిన టీ డికాషన్‌ లేదా టీ పొడిని పారేయకుండా వాటిని కుండీలలో వేస్తే చక్కని ఎరువులా మొక్కలకు ఉపయోగపడుతుంది. మొ క్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి.

కిచెన్‌.. వాస్తు
ఇంటి మొత్తానికి పొయ్యి ఉండేటటువంటి దిశలు రెండే ఉన్నాయి. అయితే పొయ్యి ఉంచే విషయంలో కచ్చితమైన నిర్ణయాన్ని పాటించాలి. తూర్పు ఆగ్నేయం గదిలో పొయ్యిని తూర్పుముఖంగా నిలబడేవిధంగా తూర్పు గోడను ఆనుకుని ఫ్లాట్‌ఫాంను నిర్మించుకోవాలి.

వంటింటి ఫ్లాట్‌ఫామ్‌ తూర్పు గోడనుండి దక్షిణం గోడను ఆనుకునేవిధంగా ఎల్‌ ఆకారంలో ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించుకోవచ్చు. ఫ్లాట్‌ఫామ్‌ ఉత్తరం గోడను ఆనించకుండా కనీసం ఎనిమిది అంగుళాలు లేదా ఒక అడుగు దూరం వదిలి కట్టుకోవాలి. ఆ ప్రాంతం మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకునేవిధంగా ఉండాలి. మరీ రెండు లేక మూడు అంగుళాలు గ్యాప్‌ ఉండేలా కట్టుకోవడం వలన అందులో చీకటి ఏర్పడి శుభ్రం చేయడానికి కనీసం చీపురు కూడా పట్టే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి కనీసం ఎనిమిది అంగుళాలు ఖాళీగా ఉండేలా చూసుకుని ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించుకోవాలి. వంటచేసేటప్పుడు ఆ పొయ్యిని లేదా చిమ్నీని గదిలో తూర్పు ఆగ్నేయంలో పెట్టుకుని మనం తూర్పుముఖంగా నిలబడి వంటచేసుకోవాలి. తప్పనిసరిగా సింక్‌ ఈశాన్యంలోనే ఉండాలి. అందుచేత పొయ్యికి సంబంధించిన ఫ్లాట్‌ఫామ్‌ను ఈశాన్యదిశగా నిర్మించుకోవాలి. లేకపోతే పొయ్యిని ఇంటి వాయువ్య దిశలోనైనా నిర్మించుకోవచ్చు. తూర్పు ఆగ్నేయం...సరిగ్గా దానికి అభిముఖంగా అంటే వాయువ్య పశ్చిమానికి, దక్షిణానికి కలుపుకుని ఎల్‌ ఆకారంలో ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించుకుని వంట చేసుకోవచ్చును. ఆ చోట కూడా ఉత్తరం గోడకు కనీసం 8 అంగుళాలు లేదా ఒక అడుగు స్థలం వదిలి ఫ్లాట్‌ఫామ్‌ నిర్మించుకోవాలి. అక్కడ కూడా ఫ్లాట్‌ఫ్లామ్‌కి ఉత్తర వాయువ్యంలో ఉత్తర దిశ తగలకుండా సింక్‌ను ఏర్పాటుచేసుకోవాలి. లేదా ఆ గదిలో తూర్పు నుంచి పడమరకు వచ్చేవిధంగా ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేసుకుని తూర్పు ఈశాన్యంలో సింక్‌ వచ్చేవిధంగా తూర్పునకు అభిముఖంగా నిలబడి వంట చేసుకునేవిధంగా ఫ్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేసుకోవచ్చు. వాయువ్యం దిశలో వంటగదికి దక్షిణ ఆగ్నేయం నుంచి కానీ...తూర్పు ఈశాన్యం నుంచి కానీ ద్వారం వచ్చే అవసరం ఉంటుంది. వాటన్నింటినీ చూసుకుని సరైన కొలతలతో ఆ ఫ్లాట్‌ఫామ్‌ను శాస్ర్తీయంగా నిర్మించుకోవాలి. తూర్పుగోడని ఆనించి నిర్మించే ఫ్లాట్‌ఫామ్‌ కింద గూడు వచ్చేలా ఏర్పాటుచేసుకోవాలి. ఈవిధంగా తూర్పు ఆగ్నేయం గదిలో ఉత్తర వాయువ్యం గదిలో పొయ్యికి కావాల్సిన ఫ్లాట్‌ఫామ్‌ను నిర్మించుకుని పశ్చిమాభిముఖంగా కానీ...తూర్పుముఖంగా కానీ నిలబడి వంటచేసుకోవాలి...

శుభ్రంగా ఉందా?

మైక్రోవేవ్‌ ఒవెన్‌ వంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను శుభ్రం చేసేటప్పుడు కాస్త అవగాహన ఉంటే పని తేలికవుతుంది.

* చెడు వాసనలు రాకపోయినా మైక్రోవేవ్‌ ఒవెన్‌ని అప్పుడప్పుడు శుభ్రం చేస్తూండాలి. తడి స్పాంజితో నలుమూలలా తుడవాలి.

* వండిన పదార్థాల తాలుకు ఘాటైన వాసనలు వస్తుంటే మాత్రం పాత్రలు కడిగే ద్రావణం ఉపయెగించి స్పాంజ్‌తో లోపలి భాగాలు శుభ్రం చేయాలి. వెనిగర్‌తో ఎలాంటి వాసననైనా తొలగించవచ్చు.

* నిమ్మరసం సహజమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. దుర్వాసనలు తొలగించి సువాసనలు అందిస్తుంది. ఒక గిన్నెలో చెంచా బేకింగ్‌ పౌడర్‌ వేసి రెండు రోజులపాటు ఒవెన్‌లో ఉంచితే ఎటువంటి వాసనలు రావు.

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details