Non Veg Recipes

ఆంధ్రా చికెన్‌:-
Andhra Chicken Recipesకావలసినవి:-

ఎముకల్లేని చికెన్‌ముక్కలు(మెత్తనివి): అరకేజీ, నీళ్లు: అరలీటరు, దేశవాళీ టొమాటో గుజ్జు: పెద్దకప్పు, ఆరెంజ్‌ రెడ్‌ కలర్‌: పావు టీస్పూను, రిఫైండాయిల్‌: 100గ్రా||, ఉల్లిముద్ద: కప్పు, కొత్తిమీర తురుము: అరకప్పు, పచ్చిమిర్చి: నాలుగు, కరివేపాకు: రెబ్బ, అల్లంవెల్లుల్లిముద్ద: టేబుల్‌స్పూను, కొబ్బరిముద్ద: టేబుల్‌స్పూను, గసాలముద్ద: టేబుల్‌స్పూన్‌, ఆంధ్రామసాలా పొడి: ఒక టేబుల్‌స్పూను, కారం: స్పూను, పసుపు: పావు టీస్పూను, మిరియాల పొడి: పావు టీస్పూను, ఉప్పు: తగినంత
తయారుచేసే విధానం
చికెన్‌ముక్కల్ని శుభ్రంగా కడిగి అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు పట్టించి కాసేపు నాననిచ్చి,కుక్కర్‌లో కొద్దిగా నీళ్లుపోసి 15 నిమిషాలు ఉడికించాలి.

రొయ్యల సూప్:-
Andhra royyala Soup, Telugu Royala Recipesకావలసిన పదార్థాలు:-

రొయ్యలు - అర కిలో
నీళ్లు - 3 కప్పులు
దోసకాయ (చిన్నది) - 1
మొక్కజోన్న పిండి - 2 చెంచాలు
వెన్న/నెయ్యి - 2 చెంచాలు
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
ఉప్పు,నూనె - తగినంత
కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం:-
రొయ్యలను ఒలిచి,శుభ్రంగా కడగాలి. దోసకాయలను సన్నగా తురుముకోవాలి. నెయ్యి/వెన్నను వేడిచేసి రొయ్యలు వేయాలి. ఎరుపురంగులోకి వచ్చాక అల్లం,వెల్లుల్లి పేస్ట్ వేయాలి. రెండు నిమిషాల తరువాత దోసకాయ తురుము, ఉప్పు వేయాలి. మరో ఐదు నిమిషాలుంచి నీరు పోయాలి. నీళ్లు మరుగుతుండగా మొక్కజోన్న పిండి వేయాలి. మూతపెట్టి, సన్నని మంటమీద మిశ్రమం చిక్కగా అయ్యేవరకూ ఉడికించుకుని, కొత్తిమీర చల్లి దించేసుకోవాలి.

chilli fran masala Recipe, Andhra Fran Specialsచిల్లీ ప్రాన్ మసాలా:-
కావలసిన పదార్థాలు:-

రొయ్యలు - 1 కిలో
పచ్చిమిర్చి - 2
ఉల్లిపాయ - 2
టొమాటో - 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచాలు
కారం - 2 చెంచాలు
జీలకర్ర పొడి - 1 చెంచా
నిమ్మరసం - 1 చెంచా
ఉప్పు,నూనె - తగినంత
తయారీ విధానం:-
రొయ్యలను ఒలిచి,శుభ్రంగా కడిగి ఆరబెట్టలి. నూనె వేడిచేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలను వేయాలి. బాగా వేగిన తరువాత రొయ్యలను వేయాలి. వేగాక జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఉప్పు, కారం, నిమ్మరసం కూడా వేసి బాగా కలిపి మూత పెట్టాలి. పది నిమిషాలు ఉడికాక దించేసుకోవాలి.

రొయ్యల పులావ్:-
Andhra royyala pulao, Royyala pulaavకావలసిన పదార్థాలు:-

రొయ్యలు - 2 కప్పులు
బాస్మతి బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా
కారం - 1 చెంచా
గరం మసాలా - 1 చెంచా
పసుపు - 1 చెంచా
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు,నూనె - తగినంత
యాలకులు, మిరియాలు, దాల్చిన చెక్క, జాపత్రి, పులావ్ ఆకు అన్నీ కొద్దికొద్దిగా తీసుకోవాలి.
తయారీ విధానం:-
రొయ్యలకు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా కలిపి పక్కన పెట్టలి. నూనె వేడి చేసి మసాలా దినుసులు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. వేగాక కడిగిన బియ్యాన్ని వెయ్యాలి. ఐదు నిమిషాలపాటు సన్నని మంటపై వేయించి, రొయ్యలు కూడా వేయాలి. కాసేపు వేయించి నాలుగు కప్పుల నీళ్లు పోసి, సన్నని మంటపై ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి.

చికెన్ లివర్ - పెప్పర్ ఫ్రై:-
Chicken Liver Fry Recipe, Chicken Liver Fry Indian Recipesకావలసిన పదార్థాలు:-

చికెన్ లివర్ - పావు కిలో
కరివేపాకు పొడి - 1 చెంచా
మిర్యాల పొడి - అర చెంచా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - 2 చెంచా
దాల్చినచెక్క పొడి - 1 చెంచా
గరం మసాలా పొడి - 1 చెంచా
ఉప్పు, నూనె - తగినంత
తయారీ విధానం:-
లివర్‌ను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి పేస్ట్ , కరివేపాకు పొడి, మిర్యాల పొడి, ఉప్పు వేయాలి. రెండు నిమిషాల తరువాత లివర్ ముక్కలను వేయాలి. ముక్కలు ఎరుపురంగు వచ్చెవరకూ తక్కువ మంటమీద వేయించాలి. వేగిపోయిందనిపించుకుని దాల్చినచెక్క పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాలు వేయించి దించేసుకోవాలి.

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details