User Rating: / 0
PoorBest 

వ్యాయామంతోనే వెన్నునొప్పి దూరం
నడుము నొప్పి... ఇప్పుడు సర్వసహజమైన సమస్యగా తయారైంది. పిల్లల నుంచి వృద్ధుల వరకూ.. ముఖ్యంగా ఎంతోమంది స్త్రీలు వెన్నునొప్పితో బాధపడుతున్నారు. 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. కొన్ని జాగ్రత్తలతో దీనిని తప్పించుకోవటం గానీ.. తీవ్రతను తగ్గించుకోవటం గానీ చేయొచ్చు.

* నడుం నొప్పి బాగా వేధిస్తున్నప్పుడు రెండు, మూడు రోజులు విశ్రాంతిగా పడుకోవటం అవసరం. కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూసల మధ్య ఉండే డిస్క్‌ల మీద ఒత్తిడి పడి నొప్పి నుంచి పూర్తి ఉపశమనం ఉండదు. కాబట్టి పడుకొని విశ్రాంతి తీసుకోవటం అవసరం. అయితే మరీ ఎక్కువ రోజులు విశ్రాంతిగా పడుకుంటుంటే నడుం కండరాలు బలహీనపడే అవకాశమూ ఉంటుంది.
* నొప్పిగా ఉన్న నడుము భాగం మీద వేడినీటి కాపడం, ఐస్‌ బ్యాగ్‌ పెట్టడం, అవసరమైతే ఫిజియోథెరపిస్టుల వద్ద అల్ట్రాసౌండ్‌ చికిత్స వంటివి తీసుకుంటే నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.
* ఎత్తు మడమల చెప్పులు శరీరం బరువుని అటూఇటూ మారుస్తుంటాయి. దీంతో శరీరాన్ని నియంత్రించుకునే సమయంలో వెన్నెముక మీద చాలా అదనపు భారం పడుతుంది. కాబట్టి, వీటి వాడకాన్ని తగ్గించుకోవాలి.
* శారీరక శ్రమ, వ్యాయామం అలవాటు లేనివాళ్లు బరువులు ఎత్తితే కూడా నడుము నొప్పి వస్తుంది. ఇలాంటి వాళ్లు హఠాత్తుగా బరువులు ఎత్తితే కండరాలు, ఎముకలను పట్టిఉంచే కండరాలు అందుకు తగినట్టుగా స్పందించవు. ఇలాంటి వాళ్లు కాస్త పెద్ద బరువులు ఎత్తకపోవటమే మేలు. ఎత్తేటప్పుడు కూడా నడుము మీద భారం పడకుండా.. మోకాళ్ల మీదే ఎక్కువ భారం పడేలా కూర్చుని లేవాలి, వంగి లేవకూడదు.
* శారీరక బరువు ఎక్కువున్నా వెన్నెముక మీద అదనపు ఒత్తిడి, భారం పడుతుంది. కాబట్టి, బరువు నియంత్రణలో ఉంచుకోవాలి.
* స్కూలు బ్యాగుల బరువు పిల్లాడి బరువులో 10% మించకూడదు. ఈ బ్యాగులకు పట్టీలు ఉండాలి, బరువు రెండు భుజాల మీద సమానంగా పడేలా చూసుకోవాలి. 16 ఏళ్ల లోపు పిల్లలు అసలు ఎత్తు మడమల చెప్పులు ధరించకపోవటమే మేలు.
* అవసరమైనప్పుడు వైద్యుల సలహా మేరకు క్యాల్షియం మాత్రలను తీసుకోవాలి.వెన్నెముకకు బలం చేకూర్చే వ్యాయామాలను వీలైనంత త్వరగా మొదలుపెట్టాలి.. వాటిని జీవితాంతమూ కొనసాగించాలి. వీటిని నిరంతరం చేస్తుంటే అసలు వెన్నునొప్పికి ఆస్కారమే ఉండదు!

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details