Skin & Body

స్ప్రింగ్ సీజన్‌లో చర్మ సంరక్షణకు మాయిశ్చరైజర్లతోపాటుగా ఎమోలియంట్ బేస్డ్ సబ్బులు, లోషన్లు, క్రీములు ఉపయోగపడతాయి. ఠి గోరువెచ్చని నీటితో, తక్కువసేపు చేయండి. అధిక సమయం నీటిలో జలకాలాడడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై సహజసిద్ధంగా ఉండే నూనెలు నీటిలో కొట్టుకుపోయి చర్మం పొడిబారుతుంది. బాత్‌టబ్‌లో స్నానం చేసే అలవాటు ఉన్న వారు ఆ నీటిలో మాయిశ్చరైజర్లు కలుపుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. కానీ ఆ నీటిలో ఎక్కువ సేపు ఉండకూడదు. ఠి చల్లని గాలిలో తిరగడం మంచిది కాదు. దీనివల్ల చర్మంపై తెరుచుకుని ఉండే స్పోర్స్ మూసుకుపోతాయి.
ఠి చర్మాన్ని శుభ్రపరచుకున్న తరువాత ఎక్కువసార్లు టోనర్‌లను ఉపయోగించకండి. ఆల్కహాల్ స్థాయి తక్కువగా ఉన్న టోనర్‌లను మాత్రమే ఉపయోగించండి.
ఠి వారానికి ఒకసారి ఫేషియల్ మాస్క్ వేసుకోవడం వల్ల చర్మానికి సహజసిద్ధంగా ఉండే పిహెచ్ బ్యాలెన్స్ మారకుండా ఉంటుంది. చర్మం చల్లగా, తాజాగా ఉండేందుకు మిస్టర్‌ను వాడండి.
ఠి చలి క్రమక్రమంగా తగ్గిపోతూ, వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతూ ఉన్నప్పుడు డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించుకోవాలి. ముఖ్యంగా పెదవులు ఎండిపోతూ ఉన్నప్పుడు.. లిప్‌స్టిక్ వేసుకునే ముందర పెదవులపై ఉన్న డెడ్ స్కిన్‌ను తొలగించడం మంచిది. అలాగే పెదవులు కొరుక్కోకూడదు. ఇక మాయిశ్చరైజింగ్ విషయానికొస్తే.. ఇది ఈ కాలంలో ఎంత తక్కువగా చేస్తే అంత మంచిది.
తేనె, అవకాడో, మస్టర్డ్‌లను సమంగా కలిపి ఆ మిశ్రమంతో వారానికి ఒకసారి ఫేషియల్ మాస్క్ వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ తేనె, కోడిగుడ్డు తెల్ల సొన, మరో టేబుల్ స్పూన్ ఝ్చడౌnn్చజీట్ఛ లను కలిపి కూడా ఈ ఫేషియల్ మాస్క్ చేసుకోవచ్చు.
ఠి కళ్ల కింది భాగంలో ఐ-క్రీమ్ రాసి, మెల్లగా మర్దన చేయాలి.
ఠి పెదవులకు లిప్‌బామ్‌గాని, పెట్రోలియం జెల్లీగాని, విటమిన్-ఇ స్టిక్ ఉపయోగించవచ్చు.
ఠి రాత్రిళ్లు చలి ఎక్కువగా ఉంటే గనుక ఒళ్లంతా నైట్ క్రీమ్ రాసుకోండి.

కోమలం.. కాంతిమంతం
పొడి చర్మం గలవారు ముఖం మీదే కాదు చేతుల మీదా దృష్టిపెట్టాలి. అందుకు ఈ చిట్కాలు పాటించి చూడండి.

* సబ్బు తాలూకు రసాయనాలు చేతుల మీద ప్రభావం చూపుతాయి. అందుకే వస్త్రాలు, గిన్నెలు శుభ్రపరిచిన వెంటనే చేతులకు మాయిశ్చరైజర్‌ రాయాలి.
* వేడి నీరు తైలగ్రంథులపై ప్రభావం చూపుతాయి. చల్లటి నీరు సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. అందుకే చలికాలంనూ చల్లని నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి.
* తేమ ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ చర్మంలోకి ఇంకిపోతుంది. అందుకే సాన్నం చేయగానే చేతులకు రాసుకోవాలి.
* నిద్రకు ఉపక్రమించే ముందు పెట్రోలియం జెల్లితో చేతులను మృదువుగా మర్దన చేసుకోవాలి. బయటకు వెళుతున్నప్పుడు తప్పనిసరిగా చేతులకు గ్లౌెజులు ధరించాలి. ఇవి ఎండనుంచి చేతులకు రక్షణనిస్తాయి.
* శరీరానికి సరిపడా మినరల్స్‌, విటమిన్స్‌ అందితే చర్మం మృదువుగా ఉంటుంది. విటమిన్‌ సి, ఈ లు చర్మం మీద మరింత ప్రభావం చూపుతాయి.
* తాజాపండ్లు, ఆకుకూరలు, పాల పదార్థాలు అధికంగా తీసుకోవాలి.
* నెలలో ఆరుసార్లు చేపలు తీసుకోవాలి. వీటిలోని ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి. అ ఫ్యాటీ ఆమ్లాలు గుండెకూ మేలు చేస్తాయి.

Banana facial for a young look

బనానా ఫేషియల్‌
చూడగానే ఆకట్టుకునే రూపాన్ని అందరూ కోరుకుంటారు. మనిషిని చూడగానే ముందుగా ఆకట్టుకునేది ముఖం దీనిని తాజాగా, అందంగా ఉంచుకోవడానికి రకరకాల క్రీములు ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి, ప్రకృతి సిద్దంగా లభించే మూలికలతో లభించే క్రీములు బోలెడు వున్నాయి. మూలికలతో పాటు పళ్లు ప్రకృతి మనకు ఇచ్చిన వరం.

అరటితో అందం...
ఫేస్‌ప్యాక్‌లకి, ఫేషియల్‌కి పళ్లు ఎంతో ఉపయోగపడతాయి, వాటిల్లో అరటిపండుతో ఫేషియల్‌ ముఖారవిందాన్ని రెట్టింపు చేస్తుంది. అరటిపండు మనకు సహజ సిద్ధంగా లభించే ఫలం దీనిలో అనేక పోషక విలువలు ఉంటాయి. అలాంటి అరటి పండుతో ఫేషియల్‌ చేసుకుంటే మీ ముఖారవిందం ఎంతో అందంగా తయారవుతుంది.

సిరి నీ చర్మం రోజు రోజుకు నిర్జీవంగా తయారవుతోంది. ఏదైనా క్రీమ్‌ రాసుకో అని స్నేహితురాలికి సలహా ఇచ్చింది స్వప్న. ఏంటోనే స్వప్న ఎన్నో రకాల క్రీములు ప్రయత్నించి చూశాను. కానీ ఏం ప్రయోజనం లేదు. ఏం చెయ్యాలో అర్ధం కావడంలేదని వాపొయ్యింది సిరి. టివిలో, పేపర్‌లో వచ్చే ప్రకటలను చూసి వందల రూపాయలపోసి అనేక రకాల క్రీములు కొంటున్నారు. వాటి వల్ల ఎంత వరకు ప్రయోజనం కలుగుతుందనేది మాత్రం క్వక్ఛన్‌గానే మిగిలి పోతోంది. అందుకే కృత్రిమంగా తయారు చేసే క్రీములపై ఆధార పడడం అంత మంచిది కాదంటున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్‌‌స. సహజసిద్దంగా తయారయ్యే పండ్లు, నట్స్‌తో కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు అంటున్నారు.

నారింజ
దీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా చేస్తుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌ గా ఉంచే కొలాజన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ఒంట్లో నిస్సత్తువగా ఉండే మహిళలు ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్‌సి అవసరమవుతుంది. నారింజ జ్యూస్‌ తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది. తొనలలో ఉండే పీచుపదార్థం పేగులను శుద్ధిచేసి ఆహారాన్ని నిల్వ ఉంచకుండా చేయడంలో తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా ఉండటంతో రక్తప్రసరణ చక్కగా జరిగి శరీరం కూడా కాంతివంతంగా తయారవుతుంది. రక్తం తక్కువగా ఉంటే మొహం అంతా పాలిపోయి రక్తహీనతకలిగిన కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఏర్పడి అందవిహీనంగా తయారయ్యే అవకాశం ఉంది.

ముఖం మీద నల్ల మచ్చలు ఇబ్బందిగా ఉంటాయి. ఈ సమస్యను అధిగమించడానికి ఖరీదైన సౌందర్యోత్పత్తులు అవసరం లేదు. ఇంట్లోనే దొరుకుతుంది పరిష్కారం.

* రోజుకు 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. జ్యూస్‌ల రూపంలో తీసుకున్నా... ఫలితం ఉంటుంది. విటమిన్లు, మినరల్స్‌ అధికంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
* నల్లమచ్చలున్న చోట నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా పోతాయి. నిమ్మ బ్లీచింగ్‌ ఏజెంట్‌లా పనిచేస్తుంది.
* చెంచాచొప్పున వెనిగర్‌, వేడి నీళ్లు కలిపి మచ్చల మీద రాయాలి.
* ఉల్లిరసంలో దూదిని నానబెట్టి పడుకోవడానికి ముందు పదినుంచి పదిహేను నిమిషాల పాటు మచ్చల మీద మర్దన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* ఉల్లిరసానికి చెంచా తేనె కలిపి ముఖం మీద రాయాలి.
* చెంచాచొప్పున తేనె, ఓట్‌ మీల్‌ పెరుగు కలిపి ముఖానికి పట్టించాలి. పదినిమిషాల తరవాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.
* నానబెట్టిన బాదం పప్పులను మర్నాడు గ్రైండ్‌ చేసి.. తేనె నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. ఇది స్క్రబ్బర్‌లా పనిచేస్తుంది.

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details