మిర్చితో షుగర్‌కు స్వస్తి
మిరపకాయలు ఎక్కువగా తినొద్దు, తింటే అల్సర్‌ అని అంటుంటారు. అయితే ఒక నిర్ణీత పరిధిలో తింటే ఫరవాలేదు. పచ్చిమిరపకాయలంటే ఇష్టపడని తెలుగువారంటూ ఉండరు. అదివరకటికాలంలో అయితే పెరుగన్నంతో పాటు ఉల్లిపాయ, పచ్చిమిరపను కూడా నంచుకుని తినేవారు. ఇప్పటి కాలంలో పిజ్జా, బర్గర్లలో టమాటాసూప్‌, జామ్‌, జెల్లీలతో జనం హాయిగా ఆస్వాదిస్తున్నారు. అయితే ఆస్ట్రేలియాలో టస్మేనియా యూనివర్సిటీ పరిశోధకులు నిర్వహించిన సర్వేలో కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి.


mirchiమిర్చిని అధికంగా వినియోగించేవారిలో షుగర్‌ నియంత్రణ శక్తి అధికంగా ఉంటుందని ఇటీవల జరిపిన పరిశోధనలలో తేలింది. ఇందులో ఉండే కెప్సానిన్‌, డీహైడ్రాకెప్సానిన్‌లకు రక్తంలో గ్లూకోజ్‌ శాతం నిల్వలను తగ్గించే శక్తి ఉందట. మిర్చిని అధికమోతాదులో తినేవారిలో రక్తం గడ్డకట్టే అవకాశం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు. ఆస్ట్రేలియా పరిశోధకుల బృందానికి నేతృత్వం వహించిన భారతీయ సంతతికి చెందిన వైద్యుడు డా.కిరణ్‌ అహుజా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా ఇప్పటికిప్పుడు మిరపకాయలను అలవాటు చేసుకోనవ సరం లేదంటున్నారు వైద్యులు. అయితే మిరపకాయలు అధికంగా వాడేవారు తమ అలవాట్లు మార్చుకోనవసరం లేదు.

మిర్చిని అంత కారంగా తినలేకపోతే...అందులో కొద్దిగా తీపిని, చింతపండును చేర్చి కారం చట్నీగా దోసెల్లోకి తింటే బాగుంటుంది. టమాటా సాస్‌లాగా చిల్లీసాస్‌ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. కళ్ల వెంబడి నీళ్లు తెప్పించినా అది చేసే మేలు మనకు సంతోషాన్ని ఇస్తుంది.ఆంధ్రా స్పెషల్‌ మిరపకాయ బజ్జీలు ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా కనిపిస్తుంటాయి. కొద్దిగా వర్షం కురిసి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు యువతరం తప్పక మిర్చిబజ్జీలను ఆశ్రయిస్తుంటుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మిర్చిబజ్జీలను, అందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని కమ్మనైన రుచిని ఆస్వాదిస్తుంటారు.

కారం తినలేని వారు మాత్రం వాళ్ల వంక జాలిగా చూస్తుంటారు. గృహిణులు కూడా లావుగా ఉండే మిర్చి బజ్జీలలో శనగపిండిని కూరి డీప్‌గా ఫ్రై చేసుకుని కూరలా చేసుకుని అన్నంలో తింటుంటారు. సాధారణంగా లావుగా ఉండే మిర్చిలో కారం పాళ్లు కొద్దిగా తక్కువగా ఉంటుంది. దీనితో చాలా మంది చట్నీలు చేసుకోవడానికి, కూరలు చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇంత కారం వాళ్లు ఎలా తినగలుగుతున్నారా అని. కారం అధికంగా తినేవారు తీపి పదార్ధాలను తినలేరు. ఇన్నాళ్లూ షుగర్‌ వ్యాధికి చేదు కాకరతోనే నివారణ అనుకునేవారు. ఇటీవల వచ్చిన సర్వేతో మిర్చిని ప్రేమించేవారు ఇక భయపడాల్సిన పనిలేకుండా హ్యాపీగా లాగించేయవచ్చు.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details