బేబీకార్న్ మంచూరియా :-
కావలసినవి: బేబీకార్న్ - ఐదు, మొక్కజొన్న పిండి - అరకప్పు, బియ్యంపిండి - పావుకప్పు, కారం - కొద్దిగా, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉప్పు - తగినంత, నూనె వేయించేందుకు సరిపడా, ఉల్లిపొరక - కట్ట (సన్నగా తరగాలి), ఉల్లిపాయ- ఒకటి (సన్నగా తరగాలి), వెల్లుల్లి పలుకులు, సోయా, టమాటాసాస్- చెంచా చొప్పున తీసుకోవాలి.
తయారీ:
బేబీకార్న్‌ను ఒకే సైజులో తరిగి.. ఉప్పు నీటిలో ఉడికించాలి. ఇప్పుడు మొక్కజొన్న, బియ్యంపిండి, కారం, అల్లంవెల్లుల్లి ముద్ద, కొద్దిగా ఉప్పు వేసి మరో పాత్రలో బజ్జీలపిండిలా కలపాలి. ఇందులో ఉడికించిన బేబీకార్న్‌ను ముంచి బజ్జీల మాదిరి వేయించాలి. బాణలిలో కాస్త నూనె వేడిచేసి అందులో వెల్లులి పలుకులు, ఉల్లిపాయ, ఉల్లిపొరక ముక్కలు ఎర్రగా వేగనివ్వాలి. ఇందులో వేయించి పెట్టుకున్న బేబీకార్న్ ముక్కల్ని ఒక్కోటి చొప్పున ఉంచాలి. పైన సోయా, చిల్లీసాస్, టమాటా సాస్, ఇంకాస్త ఉప్పు చల్లితే వేడివేడి బేబీకార్న్ మంచూరియా రెడీ.