User Rating: / 5
PoorBest 

వెట్‌ మంచూరియన్‌ :-

veg manchurian Recipes, Andhra vet manchurianకావలసినవి:-

క్యాబేజి తరుగు - రెండు కప్పులు, క్యారెట్‌- రెండు (సన్నగా కోరాలి), అల్లంవెల్లుల్లి పలుకులు - రెండుచెంచాల చొప్పున, పచ్చిమిర్చి - రెండు (చిన్నగా తరగాలి), ఉల్లిపొరక- అరకట్ట (సన్నగా కోయాలి), మొక్కజొన్నపిండి - అరకప్పు, మైదా- చెంచా, ఉప్పు - తగినంత, కారం - చెంచా, నూనె - వేయించేందుకు సరిపడా
సాస్‌ కోసం కావలసినవి: ఉల్లిపొరక - అరకట్ట, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - ఐదారు, పచ్చిమిర్చి - రెండు, కారం - అరచెంచా, టమాట, సోయాసాస్‌- మూడుచెంచాల చొప్పున, మొక్కజొన్నపిండి - చెంచా (కొద్దిగా నీరు పోసి చిక్కని మిశ్రమంలా కలపాలి), నీళ్లు - కప్పు, ఉప్పు - తగినంత, నూనె - నాలుగుచెంచాలు.

తయారీ:-

ముందుగా క్యాబేజి తరుగు, మొక్కజొన్న పిండి, క్యారెట్‌, ఉల్లిపొరక ముక్కలు, ఉప్పు, మైదా, అల్లం, వెల్లుల్లి పలుకులు విడిగా ఓ పాత్రలోకి తీసుకుని బాగా కలపాలి. అవసరమైతేనే నీళ్లు వాడాలి. ఈ పిండిని చిన్నచిన్న ఉండల్లా చేసి బంగారువర్ణంలోకి వచ్చేదాకా నూనెలో వేయించాలి.
ఇప్పుడు సాస్‌ తయారీ చూద్దాం: బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం, సన్నగా తరిగిన ఉల్లిపొరక కాడల్ని వేయించాలి. నిమిషమయ్యాక ఉప్పు, కారం, టమాటా, సోయా సాస్‌ కలపాలి. దీనికి కప్పునీళ్లు ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండి పేస్టును చేర్చాలి. కాస్త చిక్కగా అవుతున్నప్పుడు వేయించిన ఉండల్ని ఇందులో కలిపి దింపేయాలి. అలంకరణకు ఉల్లిపొరక ముక్కలు, కొత్తిమీర తరుగు చల్లాలి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details