రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యం వలన, తినే తిండిలో కూడా తేడాలు వస్తున్నాయి. ఇప్పుడు ఏది తిన్నా ఒకరికి ఫలానా కూరగాయ పడటం లేదనో...ఫలానా పండు పడటం లేదనో చెబుతుంటారు. మరి పూర్వకాలం వారిని పరిశీలిస్తే వారు అరవైలో కూడా ఎంతో ఆరోగ్యవంతంగా తమ పని తాము చేసుకునేలా ఉండేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ కేవలం థర్టీప్లస్‌కే గ్యాస్‌ట్రబుల్, ఎసిడిటీలతో బాధపడుతున్నారు.
పిజ్జాబర్గర్లతో కాలక్షేపం చేసేవారికి కొవ్వు శాతం అధికంగా పేరుకుపోయి ఊబకాయం కూడా వస్తోందని తేలింది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వైద్యులు చెబుతున్నారు. పుదీనాను సాధారణంగా మనం బిర్యానీ, మషాలాలతో కలిపిన కూరల్లో వాడుతుంటాము. అందులో ఉండే కంటెంట్స్ జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తాయని సర్వేలు చెబుతున్నాయి. నిత్యం పుదీనాను వాడేవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతోందని సర్వేలు చెబున్నాయి.
పుదీనా ఆరోగ్య సంరక్షిని, పుదీనాలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదర సంబంధ వ్యాధులు నివారణ అవుతాయి. ఆకలి మందగించినా... పులిత్రేన్పులతో బాధపడుతున్నా... కడుపులో గ్యాస్ పేరుకుపోయినా... ఈ లేహ్యంతో జఠరరసం వృద్ధి అవుతుంది. పేగులు శుద్ధి అవుతాయి. మలబద్దకానికి కూడా ఇది విరుగుడులా పనిచేస్తుంది.
పుదీనా, అల్లం, తేనె కలిపి మొత్తగా నూరుకుని ఆ రసాన్ని ఒక చెంచాలో తీసుకుని తాగితే గొంతు గరగర, కఫం వంటివి మనలను బాధించవు. కఫం ఒక్కోసారి పైకి కిందకి వెళ్లక గొంతులోనే ఉండిపోయి చాలా ఇబ్బంది పెడుతుంది. అటువంటప్పుడు ఈ పుదీనా రసం బాగా పనిచేస్తుంది.
తరచుగా ఎక్కిళ్లు మనలను బాధిస్తుంటే పుదీనాలో చెక్కర కలుపుకుని తీసుకుంటే ఎక్కిళ్లు క్రమేణా తగ్గిపోతాయి.
ట్రాన్సిల్స్ వాపుతో చాలామంది బాధపడుతుంటారు. ముఖ్యంగా చలికాలంలో ఈ టాన్సిల్స్ వాపు ఎక్కువగా ఉంటుంది. అలువంటివారు కూడా పుదీనా రసం తీసుకుంటే టాన్సిల్స్ వాపు నివారణ అవుతుంది.
అరికాళ్ల మంటలకు పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్ట్ మాదిరిగా చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
పుదీనా ఆకుల పేస్ట్‌ను ఫేసియల్‌గా కూడా వాడుకోవచ్చు. దీనితో చర్మం కాంతివంతంగా తయారవడమేగాక... జిడ్డుచర్మానికి కూడా పరిష్కారం లభిస్తుంది.
మొటిమలు ఎక్కువగా ఉండి బాధిస్తుంటే... పుదీనా రసం, రోజ్‌వాటర్, నిమ్మకాయ రసం మూడింటినీ కలిపి మొహానికి రాసుకుంటే మొటిమలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.
పుదీనాను ఎండబెట్టి ఆ ఆకులను పొడిగా చేసుకుని టీలో కలిపి తీసుకుంటే జీర్ణసంబంధ వ్యాధులు నివారిం చబడతాయి.
పచ్చి పుదీనా ఆకులుగానీ, ఎండినవిగానీ పెరుగు లేదా మజ్జిగతో కలుపుకుని అందులో పచ్చిమామిడి ముక్కలను వేసుకుని తింటే కడుపులో మంట తగ్గుతుంది. ఇలా ఒక్కో రీతిలో ఒక్కో వ్యాధికి విరుగుడుగా చాలా అద్భుతంగా పని చేస్తుంది పుదీనా. మంచి సువానతో గుమగుమలాండించే పుదీనా వంటకాలకు మంచి రుచినికూడా చేకూర్చుతుంది.
Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details
Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details
Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details