Health Tips

neredu palluఅల్లనేరేడు చెట్టుకాడ...అంటూ జానపద పాటలు మనం వింటుంటాం. సిటీలో ఉండేవాళ్లకు నేరేడు పళ్లు అంతగా తెలియవు. కొన్ని చోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూవుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడుపండు తినగానే నోరంతా అదోమాదిరిగా కొట్టుకుపోయినట్లు ఉండి... వగరువగరుగా ఉండటంతో చిన్నపిల్లలు అస్సలే దగ్గరికి రానీయరు. కానీ నేరేడును ఆయుర్వేద శాస్త్రంలో అపర సంజీవిని అంటారు. జీర్ణసంబంధిత రోగాలకు నేరేడు దివ్యౌషధం నేరేడుపండ్లను గింజలతో సహా జ్యూస్‌ చేసుకుని సేవిస్తే కడుపులో నులిపురుగులు వెంటనే చనిపోతాయి.

జీర్ణశక్తిని అమాంతం పెంచేస్తుంది ఈ నేరేడుజ్యూస్‌. తరచుగా కడుపునొప్పితో బాధపడేవారికి ఈ జ్యూస్‌ వారం రోజులపాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలలో బాధపడేవారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి. చిన్నపిల్లలకు నేరేడు లాభాలను గురించి చెప్పాలి. వగరుగా ఉండటమే దాని ప్రత్యేకత అని దానిని తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని వారికి అర్థం అయ్యేరీతిలో చెబుతుండాలి.

విషాన్ని హరించే శక్తి...

ముందులు, శస్తచ్రికిత్సలు అందుబాటులో లేని ఆ రోజుల్లో అడవి ప్రాంతాలలో ఈ నేరేడు పండ్లు విరగగాసేవి. మొదట్లో వీటిని పిచ్చికాయలుగా భావించి జనం తీసుకునేవారు కాదట. అయితే ఇందులో ఎంతో శాస్ర్తీయత ఉన్నదని , అపర సంజీవనిలా ఇది పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పటినుంచి జనం వీటిని మందులాగా వాడుతున్నారు. పూర్వకాలంలో ఏదైనా విషపురుగులు శరీరంలో ఏదైనా భాగంలో కుట్టినట్లయితే...వెంటనే నేరేడు ఆకులను ఆ ప్రాంతంలో వేసి కట్టుకట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లవారేసరికి రోగి లేచికూర్చునేవాడట. అంటే మన శరీరంలో విషాన్ని కూడా పీల్చేసే శక్తివంతమైన ఆకులు కలిగివున్న నేరేడు చెట్టు...తన కాయల ద్వారా కూడా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించడం విశేషం.

గింజల్లోనూ విశేషమే...

నేరేడు గింజల్లో జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌ పదార్థం ఉంది. ఇది మన శరీరంలో ఉండే స్టార్చ్‌ను చక్కరగా మారుస్తుంది. అది ఉత్పత్తిచేసే చక్కర షుగర్‌వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక రకంగా మన శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను ప్రకృతిసిద్ధంగా ఇది మనకు అందిస్తోంది.

అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే వెంట్రుకలు మన కడుపులోకి పంపించేస్తుంటాం. అయితే ఆ వెంట్రుకలు కడుపులో చుట్టుకుపోయి అప్పుడప్పుడు ఇబ్బందిని కలిగిస్తుంటాయి. నేరేడు పండ్లు ఆ వెంట్రుకలను చుట్టచుట్టి బయటకు మలం ద్వారా పంపించివేస్తుంది. అందుకే నేరేడు పండ్లు విరివిగా దొరికే సీజల్‌లో అయినా నేరేడు పండ్లను తినాలి. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడు పండ్లను తినాలని పెద్దలు చెబుతుంటారు.

నోటిక్యాన్సర్‌ నివారణకు...

  • కడుపులో ఉండే నులిపురుగులను నేరేడు జ్యూస్‌ చంపేస్తుంది.

  • నోటి క్యాన్సర్‌ నిరోధానికి నేరేడుపళ్ల జ్యూస్‌ ఎంతగానో తోడ్పడుతుంది.

  • కొన్ని దేశాలలో ఈ నేరేడుపళ్లమీద విస్తృత పరిశోధనలు చేస్తున్నారు. చుండ్రు నివారణకు నేరేడు ఎంతగానో ఉపయోగపడుతుందని తేలింది.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details