User Rating: / 0
PoorBest 

ఈ రోజులలో ఒత్తిడి అనే మాట ప్రతి ఒక్కరి నోటి నుంచి వినిపిస్తోంది. ఒత్తిడిని తగ్గించుకునే ప్రక్రియ మన చేతుల్లోనే ఉంది. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాల నుంచి అధిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఆహారపు అలవాట్లను కూడా ఒక దశకు వచ్చేసరికి నియంత్రణ అవసరం. చిన్నప్పువు ఇష్టంగా తిన్నామని...పెద్దయ్యాక కూడా వాటిని అదేలా తింటామంటే కుదరదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో సమతుల ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువశాతం ఒత్తిడికి గురయ్యేవిషయంలో పురుషుల కన్నా మహిళలే ముందువరుసలో ఉంటున్నారని ఇటీవల జరిపిన పరిశోధనల్లో తేలింది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలకే వైద్యుల వద్దకు వెళ్లి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే మందులను ఊరికే వాడుతుంటాము. మన చేతిలో ఉన్న చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోము. సహజసిద్ధంగా ఒత్తిడిశాతాన్ని తగ్గించే కొన్ని ఆహారపదార్ధాలను పరిశీలిద్దామా...

బొప్పాయి:

దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

ఆరెంజ్‌ :

అత్యధికంగా ఈ కమలాల్లో లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ్రపభావం చూపే హార్మోన్ల స్థాయిని తగ్గించి మేలుచేకూరుస్తుంది.

అరటిపండు :

దీనిలో ఉండే అధిక క్యాలరీలు, మెగ్నీషియం టెన్షన్‌ను సులభంగా తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడంలో అరటిపండు ఎంతో మేలయినదని వైద్యులు చెబుతున్నారు.

బంగాళ దుంప :

జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగనిరోధక శక్తి ఇనుమడించి మనస్సును దృఢంగా , ఆరోగ్యంగా ఉంచుతుంది.

చాక్లెట్‌ :

వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజసిద్దమైన యాంటీ - డి ప్రెెస్సెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికోట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తే, పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురుకుగా ఉంచేందుకు సహకరిస్తాయి.

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details