User Rating: / 0
PoorBest 

11న శంఖం

యువ కథానాయకుడు గోపీచంద్‌, త్రిష నాయకా నాయికలుగా శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై ‘శౌర్యం’ ఫేం శివ దర్శకత్వంలో జె.భగవాన్‌, జె.పుల్లారావులు నిర్మిస్తున్న ‘శంఖం’ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం మిక్సింగ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ రామానాయుడు కలర్‌ ల్యాబ్‌లో జరుపుకుంటున్న ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు భగవాన్‌, పుల్లారావులు మాట్లాడుతూ ‘‘అత్యంత భారీ ఎత్తున గోపీచంద్‌ హీరోగా రూపొందిస్తున్న ‘శంఖం’ చిత్రం షూటింగ్‌ మొత్తం పూర్తయింది. రామానాయుడు డబ్బింగ్‌ థియేటర్‌లో ప్రస్తుతం మిక్సింగ్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ జరుగుతోంది. ఇటీవలె విడుదలైన ఈ చిత్రంలోని పాటలు శ్రోతలను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో మొదటి కాపీ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ నెల 11న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. దర్శకుడు శివ మాట్లాడుతూ ‘‘ఈ తరం ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. నిర్మాతలు భగవాన్‌, పుల్లారావులు ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఈ సినిమా మా అందరికీ మంచి పేరు తెస్తుందన్న గట్టి నమ్మకం వుంది ’’ అన్నారు. మిగిలిన పాత్రల్లో సత్యరాజ్‌, చంద్రమోహన్‌, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు, ఆలీ, వేణుమాధవ్‌, కృష్ణ భగవాన్‌, యం.యస్‌.నారాయణ, ఎల్‌.బి.శ్రీరాం, రఘునాథరెడ్డి, శ్రీనివాసరెడ్డి, బెనర్జీ, కాట్రాజు, పృధ్వి, సీత, రజిత, తెలంగాణ శకుంతల, రాధాకుమారి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: అనిల్‌ రావిపుడి, సంగీతం: తమన్‌, నిర్మాతలు: జె.భగవాన్‌, జె.పుల్లారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శివ

Add comment


Security code
Refresh

Actress Hot Gallery 

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/530010samantha_3.jpg

Samantha actress

Actress Samantha Latest Unseen Photos. Actress Samantha gallery, Actress Samantha hot gallery, Actress Samantha photos, Actress Samantha See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/9275691974817_f496.jpg

Bindumadhavi Photos

Get Bindu Madhavi Stills, Bindu Madhavi Pictures, Bindu Madhavi Images, Bindu Madhavi Photos See details

http://teluguvanitha.com/components/com_gk3_photoslide/thumbs_big/331269allu_arjun_varudu_first_look6.jpg

varudu actress

Varudu Actress Hot gallery varudu heroine photos,varudu telugu movie actress Bhanu See details